Rana Daggubati: తండ్రి కాబోతున్న రానా దగ్గుబాటి? .. జోరుగా ప్రచారం

Rana Daggubati to Become a Father Rumors Surface
  • తండ్రి కాబోతున్నట్లు రానా దగ్గుబాటిపై ప్రచారం
  • ఆయన సతీమణి మిహిక గర్భవతి అంటూ వార్తలు
  • గతంలో వచ్చిన వార్తలను ఖండించిన జంట
టాలీవుడ్‌లో ఈ మధ్య వరుసగా శుభవార్తలు వినిపిస్తున్నాయి. కొందరు హీరోలు వివాహ బంధంలోకి అడుగుపెడుతుండగా, మరికొందరు తండ్రులుగా ప్రమోషన్ పొందుతున్నారు. తాజాగా, స్టార్ హీరో రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. ఆయన అర్ధాంగి మిహిక బజాజ్ గర్భవతి అని, త్వరలోనే దగ్గుబాటి కుటుంబంలోకి కొత్త సభ్యుడు రాబోతున్నారని టాక్ నడుస్తోంది.

గతంలో కూడా మిహిక గర్భవతి అంటూ వార్తలు వచ్చాయి. అయితే, అప్పుడు ఆ ప్రచారాన్ని రానా దంపతులు ఖండించారు. కానీ ఇప్పుడు మరోసారి ఈ వార్త తెరపైకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈసారి ఈ వార్త నిజమేనని, ఓ మంచి రోజు చూసుకుని అధికారికంగా ప్రకటించాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ వార్తలో నిజమెంతో తెలియకపోయినా, ఇది సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. రానా అభిమానులు అప్పుడే శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. తమ అభిమాన హీరో తండ్రి కాబోతున్నాడన్న వార్తతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ ప్రచారంపై రానా గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంతవరకు స్పందించలేదు. వారు అధికారికంగా ప్రకటన చేస్తేనే ఈ వార్తలో ఎంత నిజముందో స్పష్టత వస్తుంది. అప్పటివరకు వేచి చూడాల్సిందే.
Rana Daggubati
Mihika Bajaj
Rana Daggubati father
Mihika Bajaj pregnancy
Tollywood news
Telugu cinema
Daggubati family
celebrity news
pregnancy rumors

More Telugu News