Virat Kohli: కోహ్లీ ఫామ్ పై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Virat Kohli Form Ravi Shastri Makes Interesting Comments
  • ఫెర్త్, ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండు వన్డేల్లో విరాట్ కోహ్లీ విఫల ప్రదర్శన
  • రెండు మ్యాచ్‌ల్లో విరాట్ డకౌట్ 
  • విరాట్ సాధ్యమైనంత త్వరగా తన ఫామ్ ను పెంచుకోవాలన్న రవిశాస్త్రి
పెర్త్, అడిలైడ్ వేదికగా జరిగిన రెండు వన్డేల్లోనూ విరాట్ కోహ్లీ విఫలమైన ప్రదర్శనపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత వన్డేల్లో తిరిగి అడుగుపెట్టిన కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడం ఆయన కెరీర్‌లోనే మొదటిసారి.

ఈ నేపథ్యంలో ఓ క్రీడా ఛానల్‌తో రవిశాస్త్రి మాట్లాడుతూ.. విరాట్ సాధ్యమైనంత త్వరగా తన ఫామ్‌ను తిరిగి పొందాలని పేర్కొన్నారు. వైట్‌బాల్ క్రికెట్‌లో టీమ్‌ఇండియాలో పోటీ తీవ్రంగా ఉందని, అది విరాట్ అయినా, రోహిత్ అయినా ఎవరికీ రిలాక్స్ అయ్యే అవకాశం లేదని, జట్టులో కొనసాగడం చాలా కష్టమని అన్నారు.

ప్రస్తుతం కోహ్లీ ఫుట్‌వర్క్‌ పరంగా కాస్త ఇబ్బంది పడుతున్నాడని రవిశాస్త్రి అన్నారు. ఇలాంటి పరిస్థితి అతనికి చాలా అరుదుగా ఎదురవుతుందని పేర్కొన్నారు. వన్డేల్లో అతడు అద్భుతమైన రికార్డులు సాధించాడని, అయితే రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేయకుండానే వెనుదిరగడం అతనికి నిరాశ కలిగించి ఉంటుందని విశ్లేషించారు.

పెర్త్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో, అడిలైడ్‌లో జేవియర్ బ్రేట్‌లెట్ బంతికి ఎల్బీగా అవుటైన కోహ్లీ.. రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవలేకపోయాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కోల్పోయిన టీమ్‌ఇండియా, శనివారం సిడ్నీలో జరగనున్న మూడో వన్డేలో అయినా గెలిచి వైట్‌వాష్ ప్రమాదం నుంచి తప్పించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. 
Virat Kohli
Virat Kohli form
Ravi Shastri
India cricket
Indian team
Cricket
Mitchell Starc
Xavier Bartlett
ODI series
Sydney

More Telugu News