Suman: రాజశేఖర్ తో గొడవేం లేదు: హీరో సుమన్!

Hero Suman Interview
  • యాక్షన్ హీరోగా మెప్పించిన సుమన్ 
  • యాంగ్రీ యంగ్ మేన్ అనిపించుకున్న రాజశేఖర్ 
  • ఇద్దరికీ డబ్బింగ్ చెప్పిన సాయికుమార్ 
  • తమ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందన్న సుమన్  

యాక్షన్ హీరోగా సుమన్ ఒక వైపునుంచి విజృంభిస్తూ ఉంటే, మరో వైపున యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ తో రాజశేఖర్ దూసుకుపోయారు. ఇద్దరూ కూడా చాలా పవర్ ఫుల్ రోల్స్ లోనే తమ సత్తా చాటుకుంటూ వెళ్లారు. ఈ ఇద్దరికీ కూడా సాయికుమార్ డబ్బింగ్ చెప్పేవారు. ఇద్దరికీ కూడా సాయికుమార్ వాయిస్ అతికినట్టుగా సరిపోయేది. ఆయా పాత్రలలో వారు రాణించడంలో సాయికుమార్ వాయిస్ ప్రమేయం ఉందని కూడా చాలామంది నమ్ముతుంటారు. 

అయితే సాయికుమార్ వాయిస్ విషయంలో సుమన్ కీ .. రాజశేఖర్ కి మధ్య గొడవ జరిగిందనీ, అప్పటి నుంచి మాట్లాడుకోవడం మానేశారనే ఒక టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది. తాజాగా 'ఐ డ్రీమ్ పోస్ట్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ కి ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించారు." నేను హీరోగా చేసిన సినిమాలకి డబ్బింగ్ చెప్పడం వల్లనే సాయికుమార్ పాప్యులర్ అయ్యారు.  ఆ తరువాతనే రాజశేఖర్ కి చెప్పడం మొదలుపెట్టారు" అని అన్నారు. 

" రాజశేఖర్ కీ .. నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. మొన్నీ మధ్య కూడా ఒక ఫంక్షన్ లో కలిస్తే మాట్లాడుకున్నాము. 'పోలీస్ స్టోరీ' తరువాత సాయికుమార్ హీరోగా బిజీ అయ్యారు. అందువలన ఆయనకి మాకు డబ్బింగ్ చెప్పడం కుదరలేదు. ఆయన నాకు కాల్ చేసి ఆ విషయం చెబితే, నేను సరేనని అన్నాను. ఆ తరువాత నాకు వేరే వారు డబ్బింగ్ చెప్పారు. కొంత గ్యాప్ తరువాత మళ్లీ సాయికుమార్ చెప్పడం మొదలుపెట్టారు. నా వైపు నుంచి చెప్పాలంటే, రాజశేఖర్ తో.. సాయికుమార్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది" అని చెప్పారు. 

Suman
Rajasekhar
Sai Kumar
Telugu actors
Tollywood
Police Story
Telugu cinema
dubbing artist
Telugu film industry
actor Suman

More Telugu News