Jaishankar: స్వేచ్ఛా హక్కులపై భారత్‌కు ఐక్యరాజ్య సమితి సూచన.. తీవ్రంగా స్పందించిన జైశంకర్

Jaishankar Responds to UN on Freedom Rights in India
  • మైనార్టీల రక్షణకు, భావ ప్రకటన, మీడియా స్వేచ్ఛా హక్కులు కాపాడాలన్న ఐరాస
  • ఐరాస నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యతలను ప్రతిబింబించలేవన్న జైశంకర్
  • ఐరాసలో అర్థవంతమైన సంస్కరణలు జరగాలని వ్యాఖ్య
మైనారిటీల రక్షణ, భావ ప్రకటన, మీడియా స్వేచ్ఛా హక్కులను కాపాడేందుకు భారత్ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న స్విట్జర్లాండ్ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గట్టిగా స్పందించారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐరాస నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యతలను ప్రతిబింబించలేవని స్పష్టం చేశారు.

ఐరాస 80వ వార్షికోత్సవం సందర్భంగా పోస్టల్ స్టాంపు విడుదల చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వివాదాల యుగంలో శాంతి అవశ్యమని జైశంకర్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఐక్యరాజ్య సమితిలో అంతా సరిగా లేదని అన్నారు. ఐరాసలో అర్థవంతమైన సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితిలో మార్పులు జరిగేలా సంస్కరణలు ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఐక్యరాజ్య సమితికి భారత్ ఎప్పుడూ బలమైన మద్దతుదారుగానే ఉంటుందని, అలాగే కొనసాగుతుందని తెలిపారు. కానీ ఐక్యరాజ్య సమితి నిర్ణయాలు దాని సభ్యత్వాన్ని, ప్రపంచ ప్రాధాన్యతలను ప్రతిబింబించవని వ్యాఖ్యానించారు. జాత్యాహంకారం, వివక్ష, విదేశీయులపై విద్వేషం వంటి అంతర్గత సవాళ్లను స్విట్జర్లాండ్ ఎదుర్కొంటున్న సంగతిని ఆయన ప్రస్తావించారు.
Jaishankar
S Jaishankar
United Nations
UN
India
Switzerland
Human Rights
Freedom of Speech

More Telugu News