Kurnool bus accident: కర్నూలు బస్సు ప్రమాదం.. మృతదేహాలకు ప్రమాదస్థలి వద్దే డీఏన్ఏ, పోస్టుమారం టెస్టులు

Kurnool bus accident DNA and postmortem tests at accident spot
  • కర్నూలు సమీపంలో ప్రైవేట్ బస్సులో ఘోర అగ్నిప్రమాదం
  • ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు సజీవ దహనం
  • గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు, ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం
  • డీఎన్ఏ పరీక్షల రిపోర్టుల ఆధారంగా మృతదేహాల అప్పగింత
  • నలుగురు క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స
కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతదేహాలను వెలికితీశారు. అయితే, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వాటిని గుర్తించడం కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో, ఘటనా స్థలంలోనే వైద్య బృందాలు పోస్టుమార్టంతో పాటు డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలను సేకరిస్తున్నాయి. డీఎన్ఏ రిపోర్టులు వచ్చిన తర్వాత, వాటి ఆధారంగా మృతులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు బంధువులు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

మరోవైపు, ఈ ప్రమాదంలో గాయపడిన వారి గురించి కూడా సూపరింటెండెంట్ వివరాలు తెలిపారు. మొత్తం 12 మందికి ఆసుపత్రిలో వైద్యం అందించగా, స్వల్ప గాయాలైన 8 మందికి ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జి చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. వీరిలో ఒకరికి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని, మిగిలిన ముగ్గురి పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన వివరించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Kurnool bus accident
Kurnool
Bus accident
DNA test
Postmortem
Andhra Pradesh
AP news
Accident victims
Road accident
Private travels bus

More Telugu News