Mohan Babu: ఇది మాటలకు అందని విషాదం: మోహన్ బాబు

Kurnool bus tragedy Mohan Babu expresses grief
  • కర్నూలు బస్సు ప్రమాదంపై సినీ ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
  • మోహన్ బాబు, ఖుష్బూ, విష్ణు ఆవేదన
  • ప్రమాదం కలచివేసిందన్న విష్ణు
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మందికి పైగా సజీవదహనమైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. ఈ దుర్ఘటనపై నటులు మోహన్‌బాబు, ఖుష్బూ, విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ విచారాన్ని తెలిపారు.

ఈ ప్రమాదంపై మోహన్‌బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హైదరాబాద్‌-బెంగళూరు హైవేపై జరిగిన బస్సు దుర్ఘటన గురించి విని చాలా బాధపడ్డాను. క్షణాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మాటలకందని విషాదం. కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.

నటి ఖుష్బూ స్పందిస్తూ, ‘‘కర్నూలులో జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఈ దారుణమైన క్షణాలను తట్టుకునే శక్తినివ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. నటుడు విష్ణు కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, ‘‘బస్సు ప్రమాద ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం’’ అని అన్నారు.
Mohan Babu
Kurnool bus accident
AP bus fire
Kaveri travels bus accident
Khushbu
Vishnu Manchu
Andhra Pradesh road accident
Hyderabad to Bangalore bus
Bus fire accident
Road accident India

More Telugu News