Mahi Khan: ‘ముంబైలో దిగు, నీ సంగతి చూస్తా’.. విమానంలో ప్రయాణికుడికి బెదిరింపు.. వీడియో ఇదిగో!

Air India Flight Passenger Threatens Mahi Khan Over Language
  • మరాఠీ మాట్లాడలేదని ప్రయాణికుడిపై మహిళ ఆగ్రహం
  • ఘటనను వీడియో తీసి పోస్ట్ చేసిన కంటెంట్ క్రియేటర్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళ సహ ప్రయాణికుడిపై భాష పేరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. మరాఠీలో మాట్లాడలేదన్న కారణంతో అతడిని బెదిరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మహీ ఖాన్ అనే కంటెంట్ క్రియేటర్ కోల్‌కతా నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా విమానం ఎI676లో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళా ప్రయాణికురాలు అతడితో వాగ్వాదానికి దిగింది. ‘నువ్వు ముంబై వెళ్తున్నావు కాబట్టి మరాఠీలోనే మాట్లాడాలి’ అని ఆమె డిమాండ్ చేసింది. తనకు మరాఠీ రాదని ఖాన్ చెప్పడంతో ఆమె మరింత ఆగ్రహంతో ఊగిపోయింది.

ఈ వివాదం ముదరడంతో మహీ ఖాన్ విమాన సిబ్బందిని పిలిచాడు. వారి ముందే ఆ మహిళ, ‘ముంబైలో దిగు, నీకు మర్యాద అంటే ఏంటో చూపిస్తా’ అంటూ తనను బెదిరించిందని ఖాన్ ఆరోపించాడు. ఈ సంభాషణను వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘కేవలం వేరే భాష మాట్లాడినందుకు ఏ ప్రయాణికుడికీ ఇలాంటి అవమానం జరగకూడదు. ఇలాంటి వారిని విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించాలి’ అని ఎయిర్ ఇండియాను ట్యాగ్ చేస్తూ ఖాన్ తన పోస్టులో డిమాండ్ చేశాడు.

ఈ వీడియో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే వైరల్‌గా మారింది. లక్షకు పైగా లైకులు, వేల సంఖ్యలో కామెంట్లు వెల్లువెత్తాయి. వీడియోలో సదరు మహిళ హ్యుందాయ్ లోగో ఉన్న షర్ట్ ధరించడంతో, నెటిజన్లు ఆ కారు కంపెనీని ట్యాగ్ చేస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ఇది మా మహారాష్ట్ర సంస్కృతి కాదు, భాష పేరుతో బలవంతం చేయడం తప్పు’ అని పలువురు మహారాష్ట్రీయులు సైతం కామెంట్లు పెడుతున్నారు.  
Mahi Khan
Air India
Mumbai
Marathi Language
Flight AI676
Passenger Harassment
Language Dispute
Social Media Viral
Maharashtra Culture

More Telugu News