Tamil Nadu: తమిళనాడులో దారుణం.. కన్నతల్లిని చంపి.. తండ్రిపై నెపం నెట్టాలని చూసిన 14 ఏళ్ల బాలుడు!

Tamil Nadu Boy Murders Mother To Blame Father Gunasekaran
  • చదువు విషయంలో తల్లితో గొడవ
  • తల్లిని దారుణంగా హత్య చేసిన 14 ఏళ్ల కుమారుడు
  • నేరం తండ్రిపై నెట్టేందుకు ప్రయత్నం
  • పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన నిజం
  • తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లాలో ఘటన
చదువుకోమని నిత్యం ఒత్తిడి చేస్తోందన్న కోపంతో కన్నతల్లినే ఓ బాలుడు దారుణంగా హత్య చేశాడు. ఈ నేరాన్ని తండ్రిపైకి నెట్టి తప్పించుకోవాలని చూసినా, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కీల్‌కుప్పంవేలూరు గ్రామానికి చెందిన గుణశేఖరన్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య మహేశ్వరి (40), ఒక కుమార్తె, 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు. దీపావళి రోజున గుణశేఖరన్‌ భార్యకు చీర కొని తీసుకురాగా, ఆమె దానిని తీసుకునేందుకు నిరాకరించింది. ఈ విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో గుణశేఖరన్‌ భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో మహేశ్వరి కోపంగా ఇంటి నుంచి పొలానికి వెళ్లిపోయింది.

అదే రోజు సాయంత్రం గ్రామ శివార్లలోని పొలాల్లో మహేశ్వరి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నావలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దంపతుల మధ్య జరిగిన గొడవ గురించి తెలియడంతో తొలుత భర్త గుణశేఖరన్‌పైనే అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు.

అయితే, కేసును లోతుగా దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మహేశ్వరి కుమారుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో బుధవారం అతడిని విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. చదువు విషయంలో తల్లి నిత్యం మందలించడంతో ఆమెపై కోపం పెంచుకున్నట్లు బాలుడు తెలిపాడు. తల్లిదండ్రులు గొడవపడటంతో తల్లిని చంపి నేరం తండ్రి మీదకు నెట్టేయవచ్చని భావించినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు బాలుడిని అరెస్టు చేసి, గురువారం జువైనల్‌ హోంకు తరలించారు.
Tamil Nadu
Gunasekaran
Maheshwari
Tamil Nadu
Killkuppamvelur
Kalakurichi district
matricide
crime news
police investigation
juvenile crime
family dispute

More Telugu News