కలకలం రేపుతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ స్టేటస్
- తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని మధ్య భగ్గుమన్న విభేదాలు
- టికెట్ కోసం చిన్ని అనుచరులకు డబ్బులిచ్చానంటూ కొలికపూడి సంచలన ఆరోపణ
- బ్యాంకు స్టేట్‌మెంట్‌ను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టిన ఎమ్మెల్యే
- వివాదంపై దృష్టి సారించిన టీడీపీ అధిష్ఠానం
- ఇద్దరు నేతలను మంగళగిరికి పిలిచిన పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
- రేపు తేలనున్న కొలికపూడి-చిన్ని వివాదం
టీడీపీ టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు అడిగారని కొలికపూడి ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బు ఇచ్చానంటూ, ఆ మేరకు బ్యాంక్ స్టేట్ మెంట్ ను తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టారు.
అయితే ఈ వివాదంపై టీడీపీ అధినాయకత్వం దృష్టి సారించింది. రేపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దీనిపై పంచాయితీ చేయనున్నారు. రేపు పార్టీ కార్యాలయానికి రావాలంటూ ఎమ్మెల్యే కొలికపూడిని, ఎంపీ చిన్నిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలిచారు.పల్లా ఇద్దరితో చర్చించిన అనంతరం, ఈ వివాదాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.