Nara Rohit: నారా వారి ఇంట ప్రారంభమైన పెళ్లి సందడి.. నారా రోహిత్ పెళ్లి తేదీ ఇదే!

Nara Rohit to Marry Sirisha on October 30
  • శిరీషతో ఏడడుగులు వేయనున్న హీరో
  • అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు వివాహ ముహూర్తం
  • హైదరాబాద్‌లో నాలుగు రోజుల పాటు ఘనంగా వేడుకలు
  • అక్టోబర్ 25 నుంచి మొదలుకానున్న పెళ్లి సందడి
  • హాజరుకానున్న సినీ, రాజకీయ ప్రముఖులు
టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన తన ప్రేయసి శిరీషతో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి సంబంధించిన ముహూర్తాన్ని తాజాగా ఖరారు చేశారు. అక్టోబర్ 30వ తేదీ రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.

ఈ వివాహ వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయని సమాచారం. పెళ్లి సందడి అక్టోబర్ 25న హల్దీ వేడుకతో ప్రారంభం కానుంది. అనంతరం అక్టోబర్ 26న సంప్రదాయబద్ధంగా పెళ్లికొడుకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అక్టోబర్ 28న మెహందీ వేడుకను ఎంతో సందడిగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత నారా రోహిత్ ఓ వైపు సినిమాలతో బిజీ అవుతూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
Nara Rohit
Nara Rohit wedding
Nara Rohit marriage
Tollywood
Sirisha
Hyderabad wedding
Telugu cinema
Nara family
Celebrity wedding
October 30

More Telugu News