Pooja Hegde: అల్లు అర్జున్ సినిమాలో బంపరాఫర్ కొట్టేసిన పూజా హెగ్డే

Pooja Hegde Bags Bumper Offer in Allu Arjun Movie
  • అల్లు అర్జున్-అట్లీ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్
  • ప్రత్యేక గీతం కోసం రూ. 5 కోట్ల భారీ పారితోషికం ఆఫర్
  • 'కూలీ' సక్సెస్ తో పూజకు పెరిగిన డిమాండ్ అన్న ప్రచారం
  • రూ. 700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ
  • ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారంటూ వార్తలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‍లో వస్తున్న భారీ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‍లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం కోసం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను సంప్రదించినట్లు, ఆమెకు ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‍గా మారింది.

ఇటీవల రజినీకాంత్ హీరోగా వచ్చిన 'కూలీ' సినిమాలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్‍కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ పాట విజయంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో అల్లు అర్జున్, అట్లీలు తమ సినిమాకు పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ అయితే కచ్చితంగా ప్లస్ అవుతుందని భావించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సినిమా విజయంలో ఈ పాట కీలకమవుతుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

‘AA22xA6’ అనే వర్కింగ్ టైటిల్‍తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‍తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‍గా దీన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్టును అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ఏకంగా ఆరుగురు కథానాయికలు నటించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. వారిలో దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న వంటి ప్రముఖ తారల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Pooja Hegde
Allu Arjun
Atlee
AA22xA6
Special Song
Item Song
Tollywood
Sun Pictures
Deepika Padukone
Rashmika Mandanna

More Telugu News