Chandrababu Naidu: నవంబర్ 7న ఏపీ కేబినెట్ భేటీ .. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

Chandrababu Naidu to Chair AP Cabinet Meeting on November 7
  • సచివాలయంలో నవంబర్ 7న ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం
  • వివిధ కీలక అంశాలపై చర్చించిన నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
  • విశాఖ భాగస్వామ్య సదస్సుపై ప్రధాన చర్చ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నవంబరు 7వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా, ఇందులో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కొన్ని ముఖ్యమైన అంశాలను ఆమోదించనున్నారు. ప్రతి నెల రెండు సార్లు ఏపీ కేబినెట్ భేటీ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో భాగంగా నవంబర్ నెలలో మొదటి కేబినెట్ బేటీ 7వ తేదీన జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. అజెండాలోని అంశాలకు సంబంధించి అన్ని శాఖలు ప్రతిపాదనలను నవంబర్ 5వ తేదీ సాయంత్రానికి పంపించాలని సీఎస్ ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సదస్సుపై చర్చించనున్నారు. సదస్సుపై ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన నేపథ్యంలో కమిటీ సూచనలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. దీంతో పాటు రాజధాని అమరావతి పనులు, వివిధ సంస్థలకు భూముల కేటాయింపులపై కూడా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదే సందర్భంలో ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు, విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే విషయంపై మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేయనున్నారని సమాచారం. 
Chandrababu Naidu
AP Cabinet Meeting
Andhra Pradesh
CII Summit Visakhapatnam
Amaravati Capital
Land Allocation
Telugu News
Political News Andhra Pradesh
AP Government
Political Criticism

More Telugu News