KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కేసీఆర్ సహా బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే

KCR BRS Star Campaigners List for Jubilee Hills By Election
  • 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీఆర్ఎస్
  • జాబితాలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పేర్లు
  • 40 మందికి వాహన అనుమతి పాస్‌లు మంజూరు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆమోదం తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ చేసిన ప్రతిపాదన మేరకు ఈ 40 మందికి వాహన అనుమతి పాస్‌లను మంజూరు చేశారు.

స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో...
కేసీఆర్,
కేటీఆర్,
హరీశ్ రావు,
తలసాని శ్రీనివాస్ యాదవ్,
పద్మారావు గౌడ్,
మహమూద్ అలీ,
ప్రశాంత్ రెడ్డి,
ఎర్రబెల్లి దయాకర్ రావు,
శ్రీనివాస్ గౌడ్,
నిరంజన్ రెడ్డి,
జగదీశ్ రెడ్డి,
గంగుల కమలాకర్,
సబితా ఇంద్రారెడ్డి,
దాసోజు శ్రవణ్,
ఎం. కృష్ణారావు,
వివేకానంద్ గౌడ్,
సుధీర్ రెడ్డి,
విష్ణువర్ధన్ రెడ్డి,
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్,
పద్మా దేవేందర్ రెడ్డి,
రావుల శ్రీధర్ రెడ్డి,
ముఠా గోపాల్,
పల్లా రాజేశ్వర్ రెడ్డి,
శంభిపూర్ రాజు,
కాలేరు వెంకటేశం,
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,
పాడి కౌశిక్ రెడ్డి,
వద్దిరాజు రవిచంద్ర,
చామకూర మల్లారెడ్డి,
మదుసూధన్,
కల్వకుంట్ల సంజయ్,
అనిల్ జాదవ్,
బండారు లక్ష్మారెడ్డి,
ఎల్. రమణ,
మర్రి రాజశేఖర్ రెడ్డి,
కొప్పుల ఈశ్వర్,
చింతా ప్రభాకర్,
షకీర్ అమీర్ మొహమ్మద్,
తక్కెల్లపల్లి రవీందర్ రావు,
షేక్ అబ్దుల్లా సోహైల్.
KCR
KCR Jubilee Hills
KTR
Harish Rao
BRS Party
Telangana Elections
Jubilee Hills By Election

More Telugu News