Konda Surekha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొండా సురేఖ దంపతుల భేటీ

Konda Surekha Meets CM Revanth Reddy Amidst Controversy
  • సీఎం వద్దకు తీసుకువెళ్లిన భట్టివిక్రమార్క, మహేశ్ కుమార్ గౌడ్
  • ఓఎస్‌డీ తొలగింపు, మంత్రి ఇంటికి పోలీసుల రాక నేథ్యంలో వివాదం
  • ఈ క్రమంలో ముఖ్యమంత్రితో భేటీకి ప్రాధాన్యత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల ముఖ్యమంత్రి నివాసంలో వారు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

ఇటీవల మంత్రి కొండా సురేఖ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మేడారం టెండర్ల విషయంలో మొదట ఆమె సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ను ప్రభుత్వం తొలగించింది. అనంతరం ఆయన కోసం పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లారు. ఈ అంశంపై సురేఖ కుటుంబ సభ్యులు ప్రభుత్వ పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో మల్లు భట్టి విక్రమార్క, మహేశ్ కుమార్ గౌడ్ ఆమెను ముఖ్యమంత్రి వద్దకు తీసుకు వెళ్లారు. కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారంపై ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రితో కొండా దంపతుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Konda Surekha
Revanth Reddy
Telangana
Mallu Bhatti Vikramarka
Mahesh Kumar Goud
Medaram tenders

More Telugu News