వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది: కేటీఆర్
- హైడ్రా బాధితులతో కలిసి సున్నం చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన కేటీఆర్
- హైడ్రా కారణంగా పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపాటు
- మరో రెండేళ్ల తర్వాత తెలంగాణలో మళ్లీ వెలుగులు చూడవచ్చన్న కేటీఆర్
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇళ్లు లేకుండా చేసిందని తీవ్రంగా విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారని ఆరోపించారు. హైడ్రా కారణంగా హైదరాబాద్ నగరంలో ఎంతోమంది పేదలు నిరాశ్రయులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సున్నం చెరువు బాధితులకు ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.