నాగార్జున, వెంకటేశ్, నయనతారలతో చిరంజీవి దీపావళి సెలబ్రేషన్స్... ఫొటోలు ఇవిగో!
- 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన సినీ నటుడు చిరంజీవి
- నాగార్జున, వెంకటేశ్, నయనతారలతో కలిసి పండుగ చేసుకున్న ఫొటోలను పంచుకున్న చిరంజీవి
- వారితో కలిసి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని వెల్లడి
ఇటువంటి మధుర క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయని చిరంజీవి అన్నారు. జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ, నవ్వు, ఐక్యతను ఇవి గుర్తుచేస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు వారితో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా అంతకుముందు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మీ ఇళ్లకు ఆనందాన్ని తీసుకురావాలని, మీ ప్రయత్నాలకు విజయం చేకూరాలని కోరుకుంటున్నానని చిరంజీవి ఉదయం 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.


