ఢిల్లీలోని ఎంపీల నివాస సముదాయంలో అగ్నిప్రమాదం
- బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో చెలరేగిన మంటలు
- లోహియా ఆసుపత్రికి ఎదురుగా నివాస సముదాయం
- మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది
బాబా ఖరాగ్ సింగ్ మార్గ్‌లోని బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం అందుకున్న అధికారులు 14 ఫైరింజన్లను మోహరించారు. దాదాపు గంట పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నివాస సముదాయన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2020లో ప్రారంభించారు.