Air China: విమానం గాల్లో ఉండగానే ప్రయాణికుడి లగేజీలో మంటలు.. చైనాలో ఘటన

Air China Flight passenger luggage catches fire mid air in China
  • హాంగ్జౌ నుంచి ఇంచియాన్‌కు వెళుతున్న విమానంలో మంటలు
  • ప్రయాణికుడి లగేజీలోని లిథియం బ్యాటరీ పేలడంతో మంటలు
  • షాంఘైలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఎయిర్ చైనా విమానంలో గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడి లగేజీలో మంటలు చెలరేగిన సంఘటన చైనాలో కలకలం రేపింది. హాంగ్జౌ నుంచి దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌కు బయలుదేరిన విమానంలో ఆ ప్రయాణికుడి లగేజీలోని లిథియం బ్యాటరీ పేలడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విమానం లోపల అంతా పొగమయం కావడంతో అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విమానాన్ని షాంఘైకి మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది.

కాగా, మంటలు ఓవర్‌హెడ్ బిన్ నుంచి బయటకు వచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఎయిర్ చైనా వెల్లడిచింది. ఓ ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.
Air China
Air China flight
China
Lithium battery explosion
Shanghai
Emergency landing
Incheon

More Telugu News