Rajnath Singh: పాకిస్థాన్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లోనే ఉంది: రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

Rajnath Singh warns every inch of Pakistan is within BrahMos range
  • లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌ను సందర్శించిన కేంద్రమంద్రి
  • ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమేనన్న రాజ్‌నాథ్ సింగ్
  • భారత్ క్షిపణి సామర్థ్యాల నుంచి పాక్ తప్పించుకోలేదని వ్యాఖ్య
పాకిస్థాన్‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ట్రైలర్ మాత్రమేనని ఆయన హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌ను రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. అక్కడ తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులు ఉత్పత్తి పూర్తయింది. వాటిని కేంద్ర ప్రభుత్వం సైన్యానికి అప్పగించింది. ఉత్తర ప్రదేశ్ రక్షణ పరిశ్రమ కారిడార్‌కు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని రాజ్‌నాథ్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి సామర్థ్యాల నుంచి పాకిస్థాన్ తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ దుస్సాహసానికి ఒడిగడితే ఊహించని రీతిలో ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు. 
Rajnath Singh
Pakistan
BrahMos
BrahMos missile
defence minister
India Pakistan relations
Lucknow

More Telugu News