రేపటి నుంచి టీమిండియా-ఆసీస్ వన్డే సిరీస్... ట్రోఫీతో కెప్టెన్ల పోజులు
- భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్
- పెర్త్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్
- ఇరు జట్లకు కొత్త కెప్టెన్లు
తొలి వన్డేకు ముందు ఇరు జట్ల కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, మిచెల్ మార్ష్ శనివారం నాడు సిరీస్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి.
సిరీస్ పూర్తి షెడ్యూల్
తొలి వన్డే: అక్టోబర్ 19, ఆదివారం - పెర్త్ స్టేడియం, పెర్త్
రెండో వన్డే: అక్టోబర్ 23, గురువారం - అడిలైడ్ ఓవల్, అడిలైడ్
మూడో వన్డే: అక్టోబర్ 25, శనివారం - సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ


