20 సెంట్ల భూమిలో 20 రకాల పంటలు.. నెలనెలా 10 వేల ఆదాయం
- రాయలసీమ రైతు అద్భుతం.. పకృతి సేద్యంతో లాభాలు
- కూరగాయలు, ఆకు కూరలు పండిస్తూ గ్రామంలోనే అమ్మకం
- తక్కువ స్థలంలో ఎక్కువ రకాల పంటలు పండించవచ్చని నిరూపిస్తున్న రైతు
కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువుకు చెందిన రైతు రమేష్ కు 20 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో తీగజాతి పంటలతో పాటు కూరగాయలు, ఆకుకూరలను రమేష్ పండిస్తున్నారు. పొలం చుట్టూ తీగజాతి పంటలు, మధ్యలో పసుపు, టమాటా, మిర్చి, బెండ, వంకాయలు.. వంటి కూరగాయలు సాగు చేస్తున్నారు. పురుగుల బెడదను తగ్గించడానికి లింగాకర్షక బుట్టలను ఉపయోగిస్తున్నట్లు రమేష్ చెప్పారు. వైవిధ్యమైన సాగు పద్ధతి వల్ల ఆయనకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుందని వివరించారు.
ఇరవై సెంట్లలో పండిస్తున్న పంటలు ఇవే..
వంకాయ, మిరప, టమాట, అలసంద, సొరకాయ, బీర, గుమ్మడి, పాలకూర, చుక్కకూర, నల్ల కుసుము, ఆవాలు, బంతిపూలు, పసుపు, సిరి ఆకు, తోటకూర, మటిక, బెండ, కంది, జనుము, కాకర.