Virat Kohli: చాలా రోజుల తర్వాత జట్టుతో కోహ్లీ.. వైరల్ అవుతున్న వీడియో!

Virat Kohli Back With Team India Video Viral
  • ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు పెర్త్‌లో భారత జట్టు ప్రాక్టీస్
  • ఉత్సాహంగా, సహచర ఆటగాళ్లతో నవ్వుతూ కనిపించిన స్టార్ బ్యాటర్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోహ్లీ ప్రాక్టీస్ వీడియో
  • ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మళ్లీ బ్లూ జెర్సీలో దర్శనం
  • ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత మళ్లీ భారత జట్టుతో కలిశాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం పెర్త్‌లో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఎంతో ఉత్సాహంగా, సహచర ఆటగాళ్లతో నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు తమ అభిమాన ఆటగాడిని మళ్లీ బ్లూ జెర్సీలో చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ రేప‌టితో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తున్నాడు. అతను 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆడాడు. ఆ టోర్నీలో పాకిస్థాన్‌పై సెంచరీ, సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 84 పరుగులతో రాణించి సత్తా చాటాడు. ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్ల నుంచి కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.

ఇక‌, ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అక్కడ 29 వన్డేల్లో 51.03 సగటుతో 1,327 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, వన్డేల్లో మొత్తం మీద 302 మ్యాచ్‌లు ఆడి 51 సెంచరీలతో 14,181 పరుగులు సాధించి, భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఏడు వన్డేల్లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో 275 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత, భారత జట్టు ఈ నెల‌ 29 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది.
Virat Kohli
India cricket
Australia ODI series
Perth practice session
Kohli comeback
Indian cricket team
2025 Champions Trophy
Cricket
ODI
Viral video

More Telugu News