AP Government: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధులు ఇవీ .. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్

AP Government Issues Orders on Village Ward Secretariat Staff Duties
  • గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్ట్ విడుదల
  • జాబ్ చార్ట్ అమలు పర్యవేక్షణ బాధ్యత జిల్లా కలెక్టర్లకు
  • విధులు నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకే సమయంలో పలు శాఖలు వేర్వేరు పనులు అప్పగించడం వల్ల సిబ్బందికి కలుగుతున్న ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ప్రభుత్వం నిర్దిష్టమైన జాబ్ చార్ట్‌ను విడుదల చేసింది.

ఏ శాఖ అయినా ఈ ఆదేశాలకు విరుద్ధంగా కొత్త ఉత్తర్వులు జారీ చేస్తే అవి రద్దైనట్లుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇకపై ఒకేసారి పలు పనులు అప్పగించాల్సిన పరిస్థితుల్లో జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారి మరియు సంబంధిత శాఖల జిల్లా అధికారుల సూచనల మేరకు, కలెక్టర్ అనుమతితో ప్రాధాన్యతను నిర్ణయిస్తారని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వం విడుదల చేసిన సాధారణ జాబ్‌ ఛార్ట్‌

* గ్రామ, వార్డు స్థాయి అభివృద్ధి ప్రణాళికల పనులన్నింటిలో పాల్గొనాలి
* ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు, విస్తరణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి
* ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ పరిధిలోని పౌరుల సమాచారాన్ని సేకరించాలి
* ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల వద్దకే చేరవేయాలి
* సచివాలయాల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారాన్ని నిరంతరం పర్యవేక్షించాలి
* విపత్తు సమయాల్లో అత్యవసర విధులు నిర్వర్తించాలి
* ప్రభుత్వం అప్పగించే ఏ విధులైనా సమయానుసారం నిర్వర్తించాలి
* నిర్ణయించిన పరీక్షలకు అర్హత సాధించాలి

జిల్లా కలెక్టర్లు లేదా నియామకాధికారులు ఈ జాబ్‌ ఛార్ట్‌ అమలు పర్యవేక్షణ బాధ్యతను తీసుకుంటారని ప్రభుత్వం పేర్కొంది. విధులు నిర్వర్తించకపోతే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆదేశాల్లో స్పష్టం చేసింది. 
AP Government
Andhra Pradesh
Grama Sachivalayam
Ward Sachivalayam
Village Secretariat
Ward Secretariat
Job Chart
Government Schemes
AP Secretariat Staff
YSR Jagan

More Telugu News