Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. వచ్చే నెల 11న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు

Jubilee Hills By Election November 11th Holiday Declared
  • నియోజకవర్గంలోని కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
  • కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నందున, ఆ రోజు నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 21 వరకు నామినేషన్లకు తుది గడువు ఉంది. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నాయి.
Jubilee Hills By-Election
Telangana Elections
Hyderabad Elections
Maganti Gopinath
Telangana Government

More Telugu News