Shivadhar Reddy: రేపు బీసీ బంద్: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక సూచనలు
- శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
- పోలీసు సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశం
- బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచన
బీసీ సంఘాలు రేపు తలపెట్టిన బీసీ బంద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రేపు (అక్టోబర్ 18)న బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఈ నేపథ్యంలో డీజీపీ పలు సూచనలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీ పేర్కొన్నారు.
బీసీ బంద్‌ను విజయవంతం చేయాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
బీసీ సంఘాలు తలపెట్టిన బీసీ బంద్‌ను విజయవంతం చేయాలని భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే వారితో పాటు తాము కూడా ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలుస్తామని ఆయన అన్నారు.