Revanth Reddy: ప్రజాపాలన విజయోత్సవాలు.. తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
- సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
- డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం
- బీసీ రిజర్వేషన్ల అంశంపై తదుపరి కార్యాచరణపై చర్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా చర్చ జరిగింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై చర్చించారు. న్యాయ నిపుణుల సూచన మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. న్యాయ నిపుణుల అభిప్రాయాలతో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆర్ అండ్ బీ పరిధిలోని హ్యామ్ రోడ్లకు తెలంగాణ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రూ. 10,500 కోట్లతో నిర్మించే 5,500 కిలోమీటర్ల మేర హ్యామ్ రోడ్లకు ఆమోదం లభించింది. దీనికి సంబంధించిన టెండర్లను త్వరలో పిలవనున్నారు. కాగా, తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు.