Chandrababu: దేశం చూపు విశాఖ వైపే.. గూగుల్ లోగోతో సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్

Chandrababu Highlights Vizags Importance with Google Logo Post
  • వైజాగ్ పేరులో గూగుల్ లోగోను చేర్చి ప్రత్యేక డిజైన్
  • సముద్ర తీరం బ్యాక్‌డ్రాప్‌తో ఆకట్టుకుంటున్న పోస్టర్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సీఎం క్రియేటివ్ ఆలోచన
  • 15 బిలియన్ డాలర్ల ఏఐ డేటా సెంటర్ రాకతో విశాఖకు కొత్త కళ
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు పెట్టనున్న నేపథ్యంలో, సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించారు. విశాఖ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆయన చేసిన ఒక క్రియేటివ్ పోస్ట్ ఇప్పుడు ఎక్స్‌ (ట్విట్టర్) లో వైరల్‌గా మారింది.

విశాఖలో గూగుల్ రాకను స్వాగతిస్తూ, ముఖ్యమంత్రి ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను పంచుకున్నారు. ఇంగ్లీషులో ‘VIZAG’ అనే పదంలోని ‘G’ అక్షరం స్థానంలో గూగుల్ కంపెనీ లోగోను ఎంతో క్రియేటివ్  గా జోడించారు. దీనికి నేపథ్యంగా అందమైన విశాఖ సముద్ర తీరాన్ని ఉంచి పోస్టర్‌ను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ద్వారా "వైజాగ్‌కు గూగుల్" అనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్, సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో విశాఖలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ కీలక పరిణామంతో దేశవ్యాప్తంగా విశాఖ నగరం టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే, దేశం చూపు ఇప్పుడు వైజాగ్‌పై పడిందనే విషయాన్ని ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి ఈ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ వినూత్న ప్రచార శైలికి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
Chandrababu
Vizag
Visakhapatnam
Google
Andhra Pradesh
Artificial Intelligence
AI Data Center
Investment
Technology
Google investment in Vizag

More Telugu News