India vs Australia: భారత క్రికెటర్లను గెలికిన ఆసీస్.. అదే మన బలహీనత అంటూ వ్యంగ్యం.. వీడియో వైర‌ల్‌!

India Australia series Aussies mock handshake controversy
  • ఆసియా కప్‌లో పాక్‌తో షేక్‌హ్యాండ్‌కు దూరంగా ఉన్న భారత్
  • భారత జట్టు తీరును ఎగతాళి చేస్తూ ఆస్ట్రేలియా వీడియో విడుదల
  • అదే మన బలహీనత అంటూ ఆసీస్ క్రికెటర్ల వ్యంగ్యాస్త్రాలు
భారత క్రికెట్ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఇటీవల టీమిండియా, పాకిస్థాన్ మధ్య చోటుచేసుకున్న ‘హ్యాండ్‌షేక్’ వివాదాన్ని లక్ష్యంగా చేసుకుని ఆసీస్ ఆటగాళ్లు ఎగతాళి చేస్తూను విడుదల చేశారు. ఈ చర్య ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ ఏం జరిగిందంటే, ఆసియా కప్ 2025 సందర్భంగా పాకిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌ల అనంతరం భారత ఆటగాళ్లు పాక్ క్రికెటర్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగానే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు ఈ విషయాన్ని ఆస్ట్రేలియా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.

ఆస్ట్రేలియాకు చెందిన ‘కేయో స్పోర్ట్స్’ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఆ దేశ పురుష, మహిళా క్రికెటర్లు ఈ అంశంపై వ్యంగ్యంగా స్పందించారు. "భారత జట్టు ఇక్కడికి వస్తోంది. అయితే, వారిలో ఒక కీలక బలహీనతను మేము గుర్తించాం" అని ఒక యాంకర్ అనగా, "సంప్రదాయ పలకరింపు (హ్యాండ్‌షేక్) అంటే వారికి పెద్దగా ఇష్టం లేదని మాకు తెలుసు. కాబట్టి ఒక్క బంతి పడకముందే వారిని మానసికంగా దెబ్బతీయొచ్చు" అని మరో యాంకర్ వ్యాఖ్యానించారు. అనంతరం ఆసీస్ ఆటగాళ్లు రకరకాల కొత్త పలకరింపులను సూచిస్తూ ఎగతాళి చేశారు. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 
India vs Australia
India
Australia
cricket
handshake controversy
Suryakumar Yadav
sports
Asia Cup 2025
mind games

More Telugu News