Vijay Mallya: బ్యాంకుల తీరుపై మండిపడ్డ విజయ్ మాల్యా

Vijay Mallya Alleges Banks Hiding Asset Recovery Details
  • తాను తీసుకున్న రుణాలకు మించి బ్యాంకులు తన నుంచి రికవరీ చేశాయని ఆరోపణ
  • ఆస్తుల రికవరీల వివరాలను బయటపెట్టడంలేదని ఆగ్రహం
  • రూ.14 వేల కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర మంత్రి అంగీకరించారన్న మాల్యా
బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలను తీర్చకుండా విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా భారతీయ బ్యాంకులపై తీవ్రంగా మండిపడ్డారు. బ్యాంకుల తీరు సరిగా లేదని, తన ఆస్తుల రికవరీకి సంబంధించిన వివరాలను దాస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను తీసుకున్న రుణాల కన్నా ఎక్కువగా బ్యాంకులు రికవరీ చేశాయని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి కూడా ఈ విషయాన్ని అంగీకరించారని, తన ఆస్తుల రికవరీ ద్వారా బ్యాంకులు రూ.14,100 కోట్ల మేర సేకరించాయని చెప్పారన్నారు. దాదాపు రూ.10,200 కోట్లు చెల్లించినట్లు రికవరీ అధికారి కూడా తెలిపారని మాల్యా గుర్తుచేశారు. ఆస్తుల రికవరీ ద్వారా తన రుణానికి సంబంధించిన చెల్లింపులు పూర్తయినా బ్యాంకులు మాత్రం రికవరీ ప్రక్రియను ఆపలేదని ఆయన విమర్శించారు.

రికవరీ చేసుకున్న సొమ్ముపై భారతీయ బ్యాంకులు పూర్తి వివరాలను వెల్లడించేవరకు తాను యూకేలో ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోనని విజయ్‌ మాల్యా స్పష్టం చేశారు. తన ఆస్తుల రికవరీకి సంబంధించిన ఖాతా వివరాలను అందించాలని విజయ్‌ మాల్యా పలుమార్లు కోర్టుల ద్వారా బ్యాంకులను అభ్యర్థించారు. ఈ విషయంపై మాల్యా తాజాగా మరోమారు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
Vijay Mallya
Vijay Mallya loans
Indian banks
loan recovery
Karnataka High Court
UK legal action
financial misconduct
bank fraud

More Telugu News