Sonam Bajwa: ముద్దు సీన్ల గురించి ఇంట్లో చెప్పా.. వాళ్ల రియాక్షన్ ఊహించలేదు: సోనమ్ బజ్వా

Sonam Bajwa on Kissing Scenes and Family Reaction
  • కెరీర్ తొలినాళ్ల నాటి సంగతులు గుర్తుచేసుకున్న నటి సోనమ్ బజ్వా
  • ముద్దు సన్నివేశాల వల్ల ఎన్నో హిందీ సినిమాలు వదులుకున్నానని వెల్లడి
  • కుటుంబ సభ్యులు, ప్రేక్షకులు ఏమనుకుంటారోనని చాలా భయపడ్డానన్న సోనమ్
  • ఈ విషయంపై తల్లిదండ్రులతో మాట్లాడగా వాళ్లు ఆశ్చర్యపరిచారని వెల్లడి
  • ‘సినిమా కోసమే కదా, దానికేంటి సమస్య’ అని వాళ్లు అనడంతో షాకయ్యానన్న ముద్దుగుమ్మ
‘బాబు బంగారం’ సినిమాలో ఓ ప్రత్యేక గీతంతో, ‘ఆటాడుకుందాం.. రా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ నటి సోనమ్ బజ్వా, తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. ముఖ్యంగా సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించడంపై తాను పడిన సంఘర్షణ, ఆ విషయంలో తన తల్లిదండ్రులు స్పందించిన తీరు గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘‘కెరీర్ ప్రారంభంలో ముద్దు సన్నివేశాలు ఉన్నాయనే కారణంతో చాలా హిందీ సినిమా ఆఫర్లను వదులుకున్నాను. ఒకవేళ అలాంటి సీన్లలో నటిస్తే పంజాబీ ప్రేక్షకులు నన్ను ఎలా చూస్తారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఏమనుకుంటారో అని నాలో నేనే మథనపడేదాన్ని. ఇది కేవలం నటన అని మా కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారా? లేదా? అనే భయం కూడా ఉండేది’’ అని సోనమ్ తెలిపారు.

ఈ సందేహాలన్నింటినీ ఒకరోజు తన తల్లిదండ్రుల ముందు పెట్టానని, వారి నుంచి వచ్చిన సమాధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె వివరించారు. ‘‘‘సినిమా కోసమే కదా అలా చేసేది. దాని వల్ల సమస్య ఏముంది?’ అని వాళ్లు చాలా తేలికగా అన్నారు. వారి మాటలు విని నేను షాకయ్యాను. ఇన్ని రోజులు ఈ విషయం గురించి వాళ్లతో ఎందుకు మాట్లాడలేదా అనిపించింది. నా భయాలన్నీ ఒక్కసారిగా పోయాయి’’ అని సోనమ్ బజ్వా పేర్కొన్నారు.

ప్రస్తుతం సోనమ్ బజ్వా, హర్షవర్ధన్‌ రాణే జంటగా నటించిన ‘ఏక్‌ దీవానే కీ దీవానియత్‌’ అనే హిందీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రొమాంటిక్ డ్రామా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2016 తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించని సోనమ్, ప్రస్తుతం పంజాబీ, హిందీ చిత్ర పరిశ్రమల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. 
Sonam Bajwa
Sonam Bajwa interview
Ek Diwaane Ki Deewaniyat
kissing scenes
Bollywood
Tollywood
Punjabi actress
Harshvardhan Rane
family reaction
movie offers

More Telugu News