Keerthy Suresh: జగపతిబాబుకు క్షమాపణలు చెప్పిన సినీ నటి కీర్తి సురేశ్

Keerthy Suresh Apologizes to Jagapathi Babu for Wedding Exclusion
  • జగపతిబాబు వ్యాఖ్యాతగా టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా'
  • టాక్ షోలో అలరించిన కీర్తి సురేశ్
  • నా పెళ్లికి పిలువలేకపోయాను క్షమించండన్న కీర్తి సురేశ్
ప్రముఖ నటి కీర్తి సురేశ్ సీనియర్ నటుడు జగపతిబాబుకు క్షమాపణలు తెలిపారు. తన వివాహానికి జగపతిబాబును ఆహ్వానించలేకపోయానందుకు ఆమె క్షమాపణ కోరారు. జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా'కు ఇదివరకే పలువురు సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. తాజాగా, ఈ టాక్ షోకు విచ్చేసిన కీర్తి సురేశ్ తన వివాహానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

తాను, ఆంథోనీ తటిల్ దాదాపు పదిహేనేళ్లుగా ప్రేమలో ఉన్నామని ఆమె తెలిపారు. ఇరువైపుల కుటుంబ సభ్యులు అంగీకరించిన తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తటిల్ ఆరేళ్లపాటు ఖతార్‌లో ఉన్నారని, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పాలనుకున్నామని అన్నారు. నాలుగేళ్ల క్రితం ఇంట్లో చెప్పామని వెల్లడించారు. తన తండ్రి వెంటనే అంగీకరించారని తెలిపారు.

అయితే తన కుటుంబ సభ్యులకు చెప్పడం కంటే ముందే మీకు చెప్పానని జగపతి బాబును ఉద్దేశించి కీర్తి సురేశ్ అన్నారు. చిత్ర పరిశ్రమలో తన ప్రేమ గురించి చాలా తక్కువ మందికి తెలుసని, అందులో మీరూ ఒకరని జగపతి బాబుతో ఈ టాక్ షో సందర్భంగా కీర్తి సురేశ్ పేర్కొన్నారు. "మిమ్మల్ని నమ్మాను కాబట్టి నా వ్యక్తిగత విషయాలు మీతో పంచుకున్నాను. కానీ వివాహానికి మిమ్మల్ని పిలవలేకపోయాను. దయచేసి క్షమించండి" అని ఆమె అన్నారు.
Keerthy Suresh
Jagapathi Babu
Keerthy Suresh marriage
Anthony Tattil
Jayammmu Nischayammura

More Telugu News