Maganti Sunitha: భర్తను తలుచుకుని కంటతడి పెట్టిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత

Maganti Sunitha Tears Up Remembering Husband
  • రహమత్ నగర్ బహిరంగ సభ వేదికపై ఉద్వేగానికి లోనైన మాగంటి సునీత 
  • నియోజకవర్గ ప్రజలు తమను సొంత కుటుంబంలా భావిస్తున్నారని వ్యాఖ్య
  • ప్రజలను గోపీనాథ్ తన కుటుంబ సభ్యులుగా చూసుకునే వారని వ్యాఖ్య
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన భర్త మాగంటి గోపీనాథ్‌ను తలుచుకుని కంటతడి పెట్టారు. రహమత్‌నగర్‌లో జరిగిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో వేదికపై ఆమె ప్రసంగిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలు తమ కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావిస్తున్నారని ఆమె అన్నారు. ఆమె ప్రసంగిస్తుండగా అభిమానులు 'జై గోపీనాథ్' అంటూ నినాదాలు చేశారు.

"గోపన్న అంటేనే జనం.. జనం అంటేనే గోపన్న. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను గోపీనాథ్ కుటుంబ సభ్యులుగా భావించేవారు. ఈరోజు ఆయన కోసం కుటుంబం తరలి వచ్చింది. ఆయన పైనుండి చూస్తూనే ఉంటారు. మనమందరం కలిసి గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకువెళదాం. నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా భావించండి. గోపీనాథ్ ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించేవారు" అని ఆమె పేర్కొన్నారు.
Maganti Sunitha
Maganti Gopinath
Jubilee Hills
BRS
Telangana Politics
Rahmath Nagar
Jubilee Hills By Election
Telangana Elections

More Telugu News