Pakistan: పాక్ పై ఆఫ్ఘానిస్థాన్ దాడి.. సౌదీ అరేబియా సాయం రాలేదేం?

Pakistan Afghanistan Conflict Saudi Arabia Refuses Help
  • ఇటీవలే పాక్, సౌదీల మధ్య సైనిక ఒప్పందం
  • ఇకపై తమలో ఎవరిపై దాడి జరిగినా కలిసి ప్రతిస్పందిస్తామని ప్రకటన
  • తాజాగా ఆఫ్ఘానిస్థాన్ తో పాక్ ఘర్షణ.. సంయమనం పాటించాలని సూచిస్తూ చేతులు దులుపుకున్న సౌదీ
దాయాది పాకిస్థాన్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సాయంగా ఉంటానని హామీ ఇచ్చిన సౌదీ అరేబియా తీరా అవసరమైన సమయంలో హ్యాండిచ్చింది. ఆఫ్ఘానిస్థాన్ తో ఘర్షణ నేపథ్యంలో సైనిక సాయం కోసం అర్థిస్తే.. సంయమనం పాటించాలని సూచిస్తూ సౌదీ చేతులు దులుపుకుంది. 

వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆఫ్ఘానిస్థాన్ పై పాక్ సైన్యం వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా సరిహద్దుల్లోని పాక్ చెక్ పోస్టులపై తాలిబాన్ సైనికులు విరుచుకుపడుతున్నారు. దాదాపు 60 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు తాలిబన్లు ప్రకటించారు. తాలిబన్ సైన్యం ధాటికి తట్టుకోలేక పాక్ సోల్జర్లు పరుగులు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఇటీవలి సైనిక ఒప్పందాన్ని గుర్తుచేస్తూ సౌదీ అరేబియా సాయం కోరింది.

ఇరు దేశాల మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం.. పాక్, సౌదీలలో ఏ దేశంపై అయినా దాడి జరిగితే రెండో దేశం కూడా సాయంగా యుద్ధ రంగంలోకి దిగాలి. ఈ మేరకు సైనిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇటీవల పాక్ ప్రధాని, సౌదీ మంత్రి మీడియా ప్రకటన కూడా చేశారు. 

తాజాగా ఆఫ్ఘానిస్థాన్ తో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో పాక్ ప్రధాన మంత్రి సౌదీ అరేబియా విదేశాంగ మంత్రికి ఫోన్ చేశారు. అయితే, ఈ దాడి విషయంలో పాకిస్థాన్‌ కు సాయం అందించేందుకు సౌదీ అరేబియా ఒప్పుకోలేదు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. సౌదీ నిర్ణయంతో పాకిస్థాన్ కు ఇబ్బందులు తప్పడంలేదు.
Pakistan
Afghanistan
Saudi Arabia
Pakistan Afghanistan conflict
Taliban
Saudi Arabia military assistance
Pakistan Saudi Arabia relations
Pakistan foreign policy
Afghanistan Pakistan border
Military agreement

More Telugu News