ఆ భవనాల వాడకానికి సలహాలివ్వండి: ఏపీ ప్రభుత్వం
- రుషికొండ భవనాల వినియోగంపై ప్రజల సూచనలు కోరిన ప్రభుత్వం
- పర్యాటక శాఖకు మెయిల్ చేయాలన్న టూరిజం అథారిటీ సీఈవో ఆమ్రపాలి
- పౌరుల సూచనలపై మంత్రుల బృందం సమీక్ష
ప్రజలు తమ సలహాలు, సూచనలను [email protected]కు మెయిల్ చేయాలని టూరిజం అథారిటీ సీఈవో ఆమ్రపాలి కోరారు. ఈ నెల 17న జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమ్రపాలి తెలిపారు. ఆయా సంస్థల నుంచీ సూచనలు కోరుతామన్నారు. పౌరులు, సంస్థల నుంచి అందుకున్న సూచనలపై మంత్రుల బృందం సమీక్ష జరుపుతుందని వెల్లడించారు. అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమ్రపాలి పేర్కొన్నారు.