love affair: ఉరేసుకుంటున్నట్లు సెల్ఫీ పంపిన ప్రియురాలు.. భయంతో పురుగుల మందు తాగిన ప్రియుడు.. కర్నూలులో విషాదం

Adulterous Couple Suicide in Kurnool Due to Family Pressure
  • భార్యను వదిలేసి అతడు.. భర్తను వదిలేసిన ఆమె.. ఇద్దరూ సహజీవనం
  • పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి తెచ్చేందుకు ఉరేసుకుంటున్నట్లు బెదిరింపు
  • పురుగుల మందు తాగి చనిపోయిన ప్రియుడు.. మరుసటి రోజు ప్రియురాలు కూడా ఆత్మహత్య
వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో విడిపోయారు. ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లిళ్లయ్యాయి. అయినా ప్రేమను చంపుకోలేక తమ భాగస్వాములను వదిలేసి వేరేచోట కాపురం పెట్టారు. ఈ క్రమంలోనే పెళ్లి కోసం ప్రియురాలు ఒత్తిడి చేయడంతో భయాందోళనకు గురైన ప్రియుడు పురుగుల మందు తాగాడు.. ఈ విషయం తెలిసి ప్రియురాలు కూడా విషం తాగింది. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరూ మరణించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డిలో ఈ విషాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..
గువ్వలదొడ్డి గ్రామానికి చెందిన ధనుంజయ గౌడ్(27), అదే గ్రామానికి చెందిన శశికళ ప్రేమించుకున్నారు. శశికళ వయసు ఎక్కువ కావడంతో వారి వివాహానికి పెద్దలు అంగీకరించకలేదు. ఇద్దరూ వేరేవారితో పెళ్లిళ్లు చేసుకుని జీవనం సాగించారు. ఆ తరువాత కూడా వారి మధ్య వివాహేతర బంధం కొనసాగింది. ఇది ఇరువురి కుటుంబాల్లోనూ చిచ్చురేపింది. ధనుంజయ్ భార్య గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది. శశికళ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఎమ్మిగనూరులో మెడికల్ షాప్ నడుపుతున్న ధనుంజయ్ వద్దకు వచ్చేసింది.

ఉరి వేసుకుంటున్నట్లు సెల్ఫీ..
ధనుంజయ గౌడ్ ఆమెను ఓ హాస్టల్‌ లో ఉంచాడు. అయితే, హాస్టల్‌లో ఉండలేకపోతున్నానని, పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాలని శశికళ ఒత్తిడి చేస్తంది. ధనుంజయ్ ను బెదిరించేందుకు మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ ఫోటోను పంపింది. ఆమె చనిపోతే తాను జైలుకు వెళ్ళాల్సి వస్తుందని భయపడ్డ ధనుంజయ గౌడ్.. గ్రామ శివార్లలోని పొలాల్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. గ్రామస్థులు గమనించి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ధనుంజయ గౌడ్ మృతి చెందాడు. ధనుంజయ గౌడ్ మరణం తట్టుకోలేక శశికళ కూడా పురుగుల మందు తాగింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత మృతి చెందింది.

love affair
Dhanunjay Goud
Sasikala
Kurnool
adultery
suicide
Emiganur
Guvvaladoddi
Andhra Pradesh

More Telugu News