Pakistan: పాకిస్థాన్ పరువు తీసిన అమెరికా.. అదంతా ఫేక్ ప్రచారమేనని క్లారిటీ

Pakistan Fake News Debunked America Clarifies Missile Supply
  • అమెరికా నుంచి అత్యాధునిక ఏఐఎం మిసైల్స్ అందుకోబోతున్నామని పాక్ ప్రచారం
  • వరుస కథనాలతో ఊదరగొట్టిన పాకిస్థాన్ మీడియా
  • పాత ఒప్పందాల విడి భాగాలే.. కొత్తగా ఎలాంటి మిసైల్స్ ఇవ్వడంలేదని అమెరికా క్లారిటీ
అంతర్జాతీయంగా అవమానాలు ఎదురవుతున్నా పాకిస్థాన్ పాలకుల తీరు మారట్లేదు. పదే పదే ఫేక్ ప్రచారాలతో దేశం పరువు తీసుకుంటున్నారు. తాజాగా అమెరికా నుంచి అత్యాధునిక మిసైల్స్ వచ్చేస్తున్నాయంటూ పాక్ నేతలు ఇటీవల ప్రకటనలు గుప్పించారు. ఆ దేశ మీడియా కూడా వరుస కథనాలను ప్రచురిస్తూ ఊదరగొట్టింది. అమెరికాకు చెందిన అత్యాధునిక మిసైల్స్ ఏఐఎం–120 తమకు అందజేస్తోందని ప్రచారం చేసింది. అయితే, ఈ వార్తాకథనాలపై అమెరికా తాజాగా స్పష్టతనిచ్చింది. పాకిస్థాన్ కు కొత్తగా ఎలాంటి మిసైల్స్ ఇవ్వడంలేదని పేర్కొంది.

2007లో 700 ఎఫ్–16 యుద్ధ విమానాల అమ్మకం సందర్బంగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు విడి భాగాలను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే అందజేసిన ఎఫ్-16 విమానాలకు సంబంధించిన సాంకేతిక సపోర్ట్, విడి భాగాలను మాత్రమే పంపిస్తున్నట్లు తెలిపింది. ఈ అంశాలను తప్పుగా అర్థం చేసుకున్న పాక్ మీడియా అవాస్తవమైన సమాచారం, అంశాలతో కథనాలు ప్రచురించిందని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది.
Pakistan
America
US Missiles to Pakistan
AIM-120
F-16
Pakistan US relations
Fake news Pakistan
US Embassy India
Pakistan military
Defense deal

More Telugu News