Tennessee factory explosion: అమెరికాలో భారీ పేలుడు.. 19 మంది మృతి చెందినట్లు అనుమానం!

Tennessee Factory Explosion Kills 19 in America
  • అమెరికాలోని టేనస్సీలో పేలుడు పదార్థాల కర్మాగారంలో భారీ పేలుడు
  • ఈ ఘటనలో 19 మంది మృతి చెంది ఉంటారని అధికారుల అనుమానం
  • సైన్యం, అంతరిక్ష అవసరాలకు పేలుడు పదార్థాలు తయారు చేసే కంపెనీలో దుర్ఘటన
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. టేనస్సీ రాష్ట్రంలోని ఓ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించి ఉండవచ్చని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైనిక, అంతరిక్ష, వాణిజ్య రంగాలకు అవసరమైన పేలుడు పదార్థాలను ఉత్పత్తి చేసే ఈ కంపెనీలో జరిగిన ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

హంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ ఈ ఘటనపై మాట్లాడుతూ, ఇది అత్యంత వినాశకరమైన పేలుడు అని అభివర్ణించారు. "ప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. ప్రస్తుతం కొంతమంది మాత్రమే సురక్షితంగా ఉన్నట్లు సమాచారం ఉంది. మిగిలిన వారంతా మరణించి ఉండే అవకాశం ఉంది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే, ఫ్యాక్టరీకి సమీపంలోని ఇళ్లు సైతం తీవ్రంగా కంపించాయి. దీంతో ఏం జరిగిందో తెలియక స్థానిక ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా శిథిలాల కుప్పగా మారింది. ప్రమాద తీవ్రత కారణంగా సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి సకాలంలో చేరుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ దుర్ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల సంఖ్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Tennessee factory explosion
Humphreys County
blast in America
explosives factory accident
US factory explosion
Tennessee
Humphreys County Sheriff Chris Davis
factory fire accident

More Telugu News