Neslen Gafoor: మలయాళ కుర్రోడి అదృష్టం మామూలుగా లేదే!

Naslen Special
  • టీనేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన 'నెస్లెన్'
  • లవ్ స్టోరీస్ తో విపరీతమైన క్రేజ్ 
  • 300 కోట్లు వసూలు చేసిన 'లోకా'
  • వరుస ప్రాజెక్టులతో బిజీ

మలయాళ ఇండస్ట్రీలో ఇప్పుడు మూడు తరాలకు చెందిన హీరోలు రాజ్యమేలుతున్నారు. ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్నారు. మలయాళ ప్రేక్షకులు కొత్త హీరోలను అంగీకరించడం .. అభిమానించడం కాస్త తక్కువగానే కనిపిస్తుంది. అలాంటి మలయాళ ప్రేక్షకుల నోట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'నెస్లెన్ గఫూర్'. పాతికేళ్ల ఈ యువకుడు ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ తో కొనసాగుతుండటం విశేషం. 

మలయాళ ఇండస్ట్రీ చాలా బలంగా కనిపిస్తుంది. ఇక్కడ వారసత్వ పోటీ కూడా బలంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో టీనేజ్ లోనే సినిమాల్లోకి రావడం .. హీరోగా తనకంటూ ఒక క్రేజ్ ను .. మార్కెట్ ను తెచ్చుకోవడం అనుకున్నంత ఆషా మాషీ వ్యవహారమేమీ కాదు. అలాంటి పరిస్థితులలో తన జర్నీని మొదలుపెట్టిన నెస్లెన్, చిన్న సినిమాలతో పెద్ద విజయాలను సాధించడం బాగా కలిసొచ్చింది. 

నెస్లెన్ 19- 20 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ఆయన చేసిన టీనేజ్ లవ్ స్టోరీస్ యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. 'ప్రేమలు' 136 కోట్లను వసూలు చేస్తే, 'లోకా' 300 కోట్లను రాబట్టింది. నెస్లెన్ ను చూస్తుంటే, కెరియర్ ఆరంభంలో కమల్ ను చూసినట్టుగా ఉందనీ, కమల్ లోని అమాయకత్వం .. ఆత్మవిశ్వాసం తనకి నెస్లెన్ లో కనిపించాయని సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ అనడం గమనించవలసిన విషయం. ఏదేమైనా చాలా చిన్న వయసులో నెస్లెన్ ఈ స్థాయి క్రేజ్ ను సంపాదించుకోవడం చూసిన వాళ్లు, కుర్రాడు అదృష్టం మామూలుగా లేదే అనుకుంటున్నారు. 

Neslen Gafoor
Malayalam cinema
Mollywood
Premalu movie
Loka movie
Malayalam film industry
Priyadarshan
Malayalam actors
Kerala films
Malayalam youth movies

More Telugu News