Venkaiah Naidu: సీజేఐపై బూటుతో దాడికి యత్నం.. స్పందించిన వెంకయ్యనాయుడు

Venkaiah Naidu Reacts to Attack Attempt on CJI
  • ఘటనను ఖండించిన మాజీ రాష్ట్రపతి
  • ఇది వ్యక్తిగత అంశం కాదని, సమాజానికి సంబంధించిన విషయమని వ్యాఖ్య
  • పార్టీ మారిన వారు రాజీనామా చేయాలన్న వెంకయ్యనాయుడు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్. గవాయ్‌పై బూటుతో దాడియత్నం ఘటనపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండించిన వెంకయ్యనాయుడు, దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం జస్టిస్ గవాయ్‌కి సంబంధిచిన వ్యక్తిగత అంశం కాదని, సమాజానికి, వ్యవస్థకు సంబంధించిన విషయమని వ్యాఖ్యానించారు.

పార్టీ మారితే రాజీనామా చేయాలి

ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి మారిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని వెంకయ్యనాయుడు అన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ని సవరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ మారి కొంతమంది మంత్రులు కూడా అవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

చట్టానికి అతీతంగా ఎవరూ వ్యవహరించకూడదని హితవు పలికారు. ప్రజలకు అందించే ఉచిత పథకాలు పరిధి దాటుతున్నాయని ఆయన విమర్శించారు. ఇలాంటి పథకాల కోసం ప్రభుత్వాలు తాహతుకు మించి అప్పులు చేస్తున్నాయని అన్నారు. అప్పులు తీసుకువచ్చేటప్పుడు ఆయా ప్రభుత్వాలు వాటిని ఎలా తీరుస్తామనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని, ఇందుకోసం అసెంబ్లీలో చర్చించాలని అన్నారు.
Venkaiah Naidu
CJI
Justice Gavai
Supreme Court
attack attempt
Rajya Sabha
10th Schedule

More Telugu News