Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం.. సురక్షితంగా బయటపడిన నటుడు

Vijay Deverakonda Car Accident Actor Safe
  • జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఘటన
  • స్వల్పంగా దెబ్బతిన్న కారు
  • స్నేహితుడి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయిన విజయ్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు స్వల్పంగా దెబ్బతిన్నది.

స్నేహితులతో కలిసి పుట్టపర్తి నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన అనంతరం ఆయన స్నేహితుడి కారులో అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు.
Vijay Deverakonda
Vijay Deverakonda car accident
Jogulamba Gadwal district
Telangana accident

More Telugu News