Justice Gavai: సుప్రీం కోర్టులో షాకింగ్ ఘటన.. సీజేఐపై షూ విసిరేందుకు ప్రయత్నించిన న్యాయవాది

Lawyer attempts to throw shoe at CJI Gavai in Supreme Court
  • అడ్డుకుని బయటకు లాక్కెళ్లిన సహచర న్యాయవాదులు, భద్రతా సిబ్బంది
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఇలాంటి ఘటనలు తనను భయపెట్టలేవన్న జస్టిస్ గవాయ్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఈరోజు సంచలన ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తిపై ఓ న్యాయవాది దాడికి యత్నించాడు. ఓ కేసు విచారణ జరుగుతుండగా సీజేఐ జస్టిస్ గవాయ్ పైకి తన షూ విసిరేందుకు ప్రయత్నించాడు. నిందితుడి ప్రయత్నాన్ని సహచర నాకయవాదులు అడ్డుకున్నారు. అతడిని కోర్టు హాల్ బయటకు లాక్కెళ్లారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానంలోనే జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
 
ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారిస్తుండగా ఓ న్యాయవాది డయాస్ వద్దకు వెళ్లి తన షూ తీసి జస్టిస్ గవాయ్ పైకి విసిరేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ న్యాయవాదిని అడ్డుకున్నారు. ఇతర న్యాయవాదులతో కలిసి అతడిని బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని సీజేఐ అవమానించాడని సదరు న్యాయవాది నినాదాలు చేశాడు. ఇలాంటి వాటికి తాను భయపడనని పేర్కొన్న సీజేఐ జస్టిస్ గవాయ్... తర్వాత యథావిధిగా విచారణను కొనసాగించారు.
Justice Gavai
CJI Gavai
Supreme Court
Lawyer attack
Shoe throwing incident
Sanatana Dharma
India Supreme Court
Chief Justice of India
Court security

More Telugu News