విజయ్ ప్రచార రథం సీజ్ చేసిన పోలీసులుు
- విజయ్ కరూర్ సభలో తీవ్ర విషాదం.. 41 మంది మృతి
- సభకు ముందే ప్రచార రథం కిందపడి ఇద్దరికి గాయాలు
- రోడ్డు ప్రమాదం ఘటనలో విజయ్ ప్రచార వాహనం సీజ్
కరూర్ సభ జరగడానికి కొన్ని గంటల ముందు విజయ్ ప్రచార రథం ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, తాజాగా ఆ ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.