Nara Lokesh: అభిమానికి సర్‌ప్రైజ్.. నేరుగా వధువు ఇంటికి వెళ్లి ఆశీర్వదించిన మంత్రి లోకేశ్

Nara Lokesh Surprises Fan Visits Brides Home to Bless Her
  • యువగళం పాదయాత్ర నుంచి లోకేశ్ కు అభిమానిగా ఉన్న యువతి
  • ఇటీవల తన పెళ్లికి రావాలంటూ లోకేశ్ కు ఆహ్వానం
  • శనివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో పెళ్లి
  • బిజీ షెడ్యూల్ లోనూ తన అభిమాని నివాసానికి వెళ్లిన లోకేశ్
  • లోకేశ్ ను చూసి ఉబ్బితబ్బిబ్బయిన పెళ్లికుమార్తె కుటుంబం
తన పెళ్లికి రావాలని ఓ మహిళా అభిమాని పంపిన ఆహ్వానాన్ని మన్నించిన ఏపీ మంత్రి నారా లోకేశ్ శనివారం అకస్మాత్తుగా వారి ఇంట ప్రత్యక్షం కావడంతో ఆ అభిమాని నోట మాటరాలేదు.

వివరాల్లోకి వెళితే... యువగళం పాదయాత్రలో భాగంగా 2023 ఆగస్టు 20వతేదీన నారా లోకేశ్ విజయవాడ నగరంలో నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆరోజు విజయవాడలో లోకేశ్ ప్రారంభించిన పాదయాత్ర మరుసటిరోజు (21-8-2023) తెల్లవారుజామున 3.30గంటల వరకు కొనసాగింది. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన భవానీ (భవ్య) అనే యువతి ఆనాటి పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం తెలిపింది. 

యువగళం యాత్ర ద్వారా లోకేశ్ అభిమానిగా మారిన భవ్య... తన పెళ్లికి విచ్చేసి ఆశీర్వదించాలంటూ ఇటీవల మంత్రి నారా లోకేశ్ కు ఆహ్వానపత్రిక పంపించింది. శనివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో భవ్య వివాహం జరగనుంది. బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ మంత్రి లోకేశ్ శనివారం మధ్యాహ్నం మొగల్రాజపురంలోని తన అభిమాని భవ్య ఇంటికి వెళ్లి ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. అకస్మాత్తుగా అభిమాన నేత లోకేశ్ తమ ఇంటికి రావడంతో భవ్యతోపాటు ఆమె తల్లిదండ్రులు నాగుమోతు రాజా, లక్ష్మి ఆనందంతో పొంగిపోయారు. లోకేశ్ ను చూసి వారి ఉద్వేగానికి గురయ్యారు.
Nara Lokesh
AP Minister
Bhavya
Yuva Galam Padayatra
Vijayawada
Wedding
Blessings
Nara Lokesh Fan
Moghalrajpuram
Andhra Pradesh Politics

More Telugu News