అమెరికాలో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి మృతి
- అమెరికాలో ప్రజ్వరిల్లిన తుపాకీ సంస్కృతి
- ఉదయం డాలస్ నగరంలో కాల్పుల ఘటన
- ప్రాణాలు కోల్పోయిన చంద్రశేఖర్
- చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాదులోని ఎల్బీనగర్
- బీడీఎస్ అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా పయనం
బీడీఎస్ అనంతరం ఉన్నత చదువుల కోసం అతడు అమెరికా వెళ్లాడు. డాలస్ నగరంలో ఉదయం జరిగిన ఈ కాల్పుల ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. చంద్రశేఖర్ ఓ పెట్రోల్ బంకులో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. పెట్రోల్ కోసం వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో చంద్రశేఖర్ మృతి చెందాడు.
దాంతో హైదరాబాద్ లోని అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రశేఖర్ మరణవార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.