ఏటా రూ.2 కోట్లు ఆర్జన.. అయినా స్వీపర్ గా విధులు
- అదీ అతి తక్కువ జీతానికే పని చేస్తున్న కోయిచి మత్సుబారా
- వారంలో 3 రోజులు.. రోజుకు 4 గంటలు విధులు
- స్వీపర్ గా నెలకు లక్ష యెన్లు సంపాదిస్తున్నట్లు వెల్లడి
మత్సుబారా వయస్సు ప్రస్తుతం 56 ఏళ్లు. ఈ వయసులోనూ మత్సుబారా ఓ నివాస సముదాయంలో పార్ట్‌టైమ్ స్వీపర్‌గా పని చేస్తున్నారు. వారంలో మూడు రోజులు, రోజుకు నాలుగు గంటల చొప్పున కష్టపడుతున్నారు. ఇందుకుగానూ మత్సుబారాకు నెలకు సుమారు 1,00,000 యెన్లు.. మన రూపాయల్లో 60 వేల వరకు ముడుతోంది. టోక్యోలో సగటు నెలసరి జీతం 3 లక్షల యెన్లతో పోల్చుకుంటే మత్సుబారా అందుకుంటున్నది తక్కువ మొత్తమేనని చెప్పొచ్చు. అయినా సరే మత్సుబారా తన పని మాత్రం మానకపోవడం విశేషం.