Lata Mangeshkar: లతా మంగేష్కర్ కార్యక్రమాన్ని సంజయ్ దత్ మధ్యలోనే ఆపేసిన వేళ...!

Lata Mangeshkar Stopped Performance Because of Sanjay Dutt
  • చిన్నప్పుడు లతా మంగేష్కర్ పాటను మధ్యలో ఆపేసిన సంజయ్ దత్
  • బంగ్లాదేశ్‌లో సంగీత కచేరీలో తప్పుగా బోంగో వాయించడమే కారణం
  • గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ గురించి చాలా మందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చిన్నతనంలో ఆయన చేసిన ఒక పని వల్ల దిగ్గజ గాయని స్వర్గీయ లతా మంగేష్కర్ తన పాటను మధ్యలోనే ఆపేశారు. ఈ విషయాన్ని ఒక పాత టీవీ షోలో సంజయ్ తండ్రి, దివంగత నటుడు సునీల్ దత్ స్వయంగా గుర్తుచేసుకున్నారు. ఇప్పుడీ పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే, 1971 యుద్ధ సమయంలో సునీల్ దత్, లతా మంగేష్కర్ తదితర కళాకారుల బృందం బంగ్లాదేశ్‌లో పర్యటించింది. ఆ సమయంలో చిన్నవాడైన సంజయ్ కూడా వారితో వస్తానని పట్టుబట్టాడు. కళాకారులు మాత్రమే వెళ్తున్నారని, ఏదైనా వాయిద్యం వాయిస్తేనే పర్యటనకు అనుమతి ఉంటుందని సునీల్ దత్ చెప్పగా, తాను బోంగో వాయిస్తానని సంజయ్ బదులిచ్చాడు. బంగ్లాదేశ్‌లో జరిగిన కచేరీలో లతా మంగేష్కర్ పాట పాడుతుండగా, సంజయ్ దత్ తప్పుగా బోంగో వాయించడంతో ఆమె మధ్యలోనే ఆగిపోయారు. వెనక్కి తిరిగి చూడగా చిన్నారి సంజయ్ కనిపించడంతో, ఆమె నవ్వుతూ "వాయిస్తూ ఉండు" అని చెప్పి తన పాటను కొనసాగించారు.
Lata Mangeshkar
Sanjay Dutt
Sunil Dutt
Bollywood
Bangladesh
1971 War
Lata Mangeshkar Songs
Bongo
Indian Singer
Bollywood Actors

More Telugu News