Abhishek Sharma: సోదరి కోమల్ శర్మ వివాహం.. హాజరుకాలేకపోయిన క్రికెటర్ అభిషేక్ శర్మ!

Abhishek Sharma misses sister Komal Sharmas wedding
  • లుథియానాకు చెందిన వ్యాపారవేత్తతో ఈరోజు పెళ్లి
  • ఆస్ట్రేలియా-ఏ జట్టుతో ఇండియా-ఏ జట్టు అనధికారిక మ్యాచ్
  • ఇండియా-ఏ జట్టులో ఉన్న అభిషేక్ శర్మ
భారత క్రికెట్ జట్టు యువ బ్యాటర్ అభిషేక్ శర్మ తన సోదరి వివాహ వేడుకకు హాజరు కాలేకపోయాడు. అతడి సోదరి కోమల్ శర్మ వివాహం లుథియానాకు చెందిన వ్యాపారవేత్త లవీశ్‌తో అమృత్‌సర్‌లో ఈరోజు జరుగుతోంది. ఇండియా-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య శుక్రవారం కాన్పూర్‌లో రెండో అనధికారిక వన్డే మ్యాచ్ కోసం అభిషేక్ శర్మ ఆగిపోయాడు. అభిషేక్ శర్మ ఇండియా-ఏ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ మ్యాచ్ కోసం అతడు బుధవారమే అక్కడకి చేరుకున్నాడు.

దీంతో అతను సోదరి వివాహ వేడుకకు హాజరు కాలేకపోతున్నాడు. "ఈరోజు నాకు జీవితంలో అద్భుతమైన రోజు" కోమల్ శర్మ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. పెళ్లి రోజున తన సోదరుడిని మిస్ అవుతున్నానని ఆమె రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా, కోమల్ శర్మ వివాహ వేడుకకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హాజరయ్యే అవకాశం ఉంది.
Abhishek Sharma
Komal Sharma
India A
Cricket
Bhagwant Mann
Ludhiana
Amritsar

More Telugu News