Telangana Liquor Sales: తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం విక్రయాలు.. దసరా ముందు ఎంత పెరిగిందంటే?

Telangana Liquor Sales Surge Before Dussehra
  • సెప్టెంబర్ నెలలో రూ. 3,046 కోట్ల మేర మద్యం అమ్మకాలు
  • దసరాకు ముందు పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు
  • గత ఏడాదితో పోలిస్తే 3 రోజుల్లోనే 80 శాతం విక్రయాలు పెరుగుదల
తెలంగాణ రాష్ట్రంలో గత నెలలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రూ. 3,046 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. దసరా పండుగకు మూడు నాలుగు రోజుల ముందు నుంచే విక్రయాలు అధికంగా నమోదయ్యాయి.

సెప్టెంబర్ 29న రూ. 278 కోట్లు, 30న రూ. 333 కోట్లు, అక్టోబర్ 1న రూ. 86.23 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ మూడు రోజుల్లోనే 60 నుంచి 80 శాతం అధికంగా అమ్మకాలు జరిగాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 29.92 లక్షల కేసుల లిక్కర్, 36.46 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోల్చితే మద్యం విక్రయాలు 7 శాతానికి పైగా పెరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
Telangana Liquor Sales
Telangana
Liquor Sales
Dussehra
Excise Department
Beer Sales
Alcohol Sales

More Telugu News