Bandaru Dattatreya: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బండారు దత్తాత్రేయ పిలుపు

Bandaru Dattatreya calls for coordination between Telugu CMs
  • ఇరువురు సమన్వయంతో ముందుకు సాగాలన్న హర్యానా మాజీ గవర్నర్
  • అభివృద్ధి విషయంలో ఒకరినొకరు ఆటంకం కలిగించుకోవద్దని హితవు
  • ఎన్ని సమస్యలు వచ్చినా పరస్పరం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలన్న దత్తాత్రేయ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమన్వయంతో ముందుకు సాగాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో తన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన 'అలయ్ బలయ్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉభయ రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ఒకరికొకరు ఆటంకాలు కలిగించకూడదని సూచించారు.

ఎన్ని సమస్యలు వచ్చినా పరస్పరం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అలయ్'-బలయ్‌'తో తెలుగు ప్రజలంతా కలిసి ఉండే వాతావరణం నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Bandaru Dattatreya
Chandrababu Naidu
Revanth Reddy
Telangana
Andhra Pradesh

More Telugu News