Ramreddy Damodar Reddy: దామోదర్ రెడ్డి భౌతికకాయానికి రేవంత్ రెడ్డి నివాళి

Revanth Reddy Pays Tribute to Damodar Reddy
  • రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దామోదర్ రెడ్డి మృతి
  • జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం భౌతికకాయం
  • రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకుల నివాళులు
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం దామోదర్ రెడ్డి మృతి చెందారు. ఈరోజు ప్రజల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు.

దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి కూడా నివాళులర్పించారు.

కోదండరెడ్డి మాట్లాడుతూ, దామోదర్ రెడ్డి, తాను ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టామని అన్నారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. ఆయనకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కోలుకుని తిరిగి పార్టీలో క్రియాశీలకంగా ఉంటారని తాము భావించామని అన్నారు. ఆయన మృతి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు.
Ramreddy Damodar Reddy
Revanth Reddy
Telangana
AIG Hospital Hyderabad

More Telugu News